వేదాల అధ్యయనంతో మానసిక ప్రశాంతత
తిరుపతి సిటీ: వేదాంత శాస్త్రాల అధ్యయనంతో ప్రశాంతత, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సులభంగా అధిగమించవచ్చని శ్రీపరమాచార్య శాస్త్ర పరిరక్షణ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ గణపతిభట్ అభిప్రాయపడ్డారు. సోమవారం జాతీయ సంస్కృత వర్సిటీ ఇండోర్ ఆడిటోరియంలో జరుగుతున్న అంతర్జాతీయ శక్తి విశిష్టాద్వైతం సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.సంస్కృత భాషలోని ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, ద్వైతవేదాంత విభాగాధ్యక్షులు నారాయణ, అధ్యాపకులు నాగరాజభట్, శివరామదాయగుడే, మనోజ్‌షిండే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment