నిత్యం ఇలా.. ఆరోగ్యం ఎలా?
రేణిగుంట మేజర్ పంచాయతీలో 90 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరు ఉదయం 5 గంటల నుంచి పంచాయతీలోని పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమవుతుంటారు. ప్రజలు స్వచ్ఛమైన జీవనం సాగించాలంటే వీరు రోడ్లు, కాలవలు శుభ్రం చేయడం పరిపాటి. అలాంటి కార్మికుల పట్ల పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులు ఎటువంటి మాస్క్‌లు, చేతికి గ్లౌజులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. కొందరికి రబ్బర్ గ్లౌజులు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. అవి లూజుగా ఉండడంతో జారిపోతున్నాయి. దీంతో కార్మికులు వాటిని పక్కన పెట్టేశారు. కొందరైతే ప్లాస్టిక్ కవర్లను చేతికి కట్టుకొని పనులు చేస్తున్నారు. – రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్)
వట్టి చేతులతోనే..
నిత్యం ఇలా.. ఆరోగ్యం ఎలా?
నిత్యం ఇలా.. ఆరోగ్యం ఎలా?
నిత్యం ఇలా.. ఆరోగ్యం ఎలా?
Comments
Please login to add a commentAdd a comment