కారులో చెలరేగిన మంటలు
పాకాల: ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన మండలంలోని పదిపుట్లబైలు వద్ద చోటుచేసుకుంది. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఓ గుణశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి మండలం, రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ తిరుపతి నుంచి మదనపల్లికి కారులో పదిపుట్లబైలు క్రాస్ రోడ్డు వద్ద మహేంద్ర కారులో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో కారులో మంటలు చెలరేగాయి. చిత్తూరు కంట్రోల్ రూం నుంచి సమాచారం రావడంతో తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ఎస్‌ఎఫ్‌ఓ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది మనోహర్‌రెడ్డి, సురేంద్రబాబు, బాలాజీ, నాగార్జున పాల్గొన్నారు.
భారత్ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు
తిరుపతి కల్చరల్: బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్‌లో నెంబర్ ఒన్ అని, భారత్ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టుపెట్టే చర్యలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో చంద్రబాబు, నితీష్ కుమారులు ఇద్దరకూ కలిసి సొంత ప్రయోజనాల కోసం మోదీని కాపాడారని విమర్శించారు. అధిక మంది పిల్లలను కందాం అనే దరిద్రమైన బీజేపీ స్లోగన్‌ను చంద్రబాబు బుజాన వేసుకున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment