జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

Published Wed, Mar 12 2025 7:22 AM | Last Updated on Wed, Mar 12 2025 7:19 AM

జిల్ల

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

● కానరాని నోటిఫికేషన్లు.. కనికరించని కూటమి నేతలు ● స్తంభించిన పారిశ్రామిక రంగం ● జాబ్‌ క్యాలెండర్‌ జాడలేక వెతలు ● వలసబాట పడుతున్న యువత ● జిల్లాలో 6 లక్షల 23వేల మంది నిరుద్యోగుల ఆర్తనాదాలు

తిరుపతిలో ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన జాబ్‌ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులు

నియోజకవర్గం యువత

తిరుపతి 1,30,000

చంద్రగిరి 85,000

శ్రీకాళహస్తి 93,000

సత్యవేడు 80,000

వెంకటగిరి 90,000

గూడూరు 75,000

సూళ్లూరుపేట 70,000

తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల ఓ సంస్థ జాబ్‌మేళా ఏర్పాటు చేసింది. సుమారు 80 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 2 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఎస్‌ఎస్‌సీ అర్హతగల ఉద్యోగానికి సైతం పీజీలు పూర్తిచేసిన యువత హాజరుకావడంతో నిర్వాహకులు ముక్కున వేలువేసుకున్నారు.

రేణిగుంటకు చెందిన వరప్రసాద్‌ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేశాడు. పేరొందిన కార్పొరేట్‌ కళాశాలలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం చేశారు. ఎంతో ఆశతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో వరప్రసాద్‌ ఉద్యోగాన్ని వదులుకుని లక్షలు అప్పుచేసి కోచింగ్‌ సెంటర్‌ బాటపడ్డారు. ఏడాది కావస్తున్నా అతీగతి లేదు. మళ్లీ జాబ్‌ వేటలో చైన్నెకి వెళ్లి ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు..

.. జిల్లాలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందనడానికి ఇవి మచ్చుకు రెండు మాత్రమే. జిల్లాలో ప్రతి ఏటా నిరుద్యోగులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు సైతం ఖాళీగా ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. కూటమి ప్రభుత్వం జాబ్‌క్యాలెండర్‌ పూర్తిగా విస్మరించడం ఏంచేయాలో తెలియక తికమకపడుతున్నారు.

ఇందులో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, టీటీసీ, డిప్లొమో చేసినవారు 1,25,000

డిగ్రీ, బీటెక్‌, బీఈడీ పూర్తి చేసిన వారు

1,55,000

పీజీ, పీహెచ్‌డీ 85,000

వృత్తి విద్య, మెడకల్‌, టెక్నికల్‌ కోర్సులు

పూర్తి చేసినవారు 2,58,000

తిరుపతి సిటీ: ‘యువతకు 20 లక్షల ఉద్యోగాలు, జాబ్‌ వచ్చేంతవరకు నెలకు రూ.3వేలు భృతి’...ఇవీ ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన వరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతిపై నోరు మెదపడం లేదు. జాబ్‌ క్యాలెండ్‌ జాడలేకపోవడంతో జిల్లాలోని నిరుద్యోగ యువత పొట్ట చేతబట్టుకుని పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. మూడుపూటలా కడుపునిండితే చాలు..చిరు ఉద్యోగమైనా చేస్తామంటూ పీజీలు, పీహెచ్‌డీలు చేసిన యువకులు ఎక్కడ జాబ్‌ మేళాలు ఏర్పాటు చేసినా వేల సంఖ్యలో ఎగబడుతున్నారు.

18 నుంచి 45 ఏళ్లలోపు

నిరుద్యోగ యువత వివరాలు

గత ఏడాది ఎన్నికల ముందు ఓ ప్రైవేటు ఎన్‌ఆర్‌ఐ సంస్థ ద్వారా తిరుపతి జిల్లాలో చేపట్టిన సర్వే ప్రకారం ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ, పీహెచ్‌డీ వరకు నియోజకవార్గాల వారీగా నిరుద్యోగ భృతికి అర్హులైన వారి జాబితా దాదాపుగా 6లక్షలా 23వేల మంది ఉన్నట్లు తేలింది. జిల్లాలో ఒక్కో నిరుద్యోగికి భృతి రూ.3వేల చొప్పున మొత్తం రూ.186.90కోట్లు నెలకు చెల్లించాల్సి ఉంది.

పరిస్థితి దారుణం

జిల్లాలో నిరుద్యోగం తాండిస్తోంది. నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగ భృతి లేదు. ప్రతి ఏడాదీ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడంలేదు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంతవరకు భృతి ఇవ్వాల్సిందే. – బండి చలపతి,

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు, తిరుపతి జిల్లా

ఎక్కడ జాబ్‌ మేళా జరుగుతున్నా..

ఉద్యోగ వేటలో ఏడాదిగా తిరిగి తిరిగి విసిగిపోయా. బీటెక్‌ సివిల్‌ పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఊసేలేదు. ప్రైవేటు కంపెనీలు రావడం లేదు. దీంతో కొత్త ఉద్యోగాలు జాడ కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. జిల్లాలో ఎక్కడ జాబ్‌ మేళా జరిగినా పడిగెడుతున్నా.

–రమణారెడ్డి, బీటెక్‌, చంద్రగిరి

ఉద్యోగావకాశాల్లేవు

నేను ఎంఏ పీహెచ్‌డీ చేశాను. వర్సిటీలో అధ్యాపక పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంతో శ్రమించి కోచింగ్‌ తీసుకున్నా. కానీ కూటమి సర్కార్‌ ఆ నోటిఫికేషన్‌ను తుంగలో తొక్కేసింది. గత ఏడాది ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. బెంగళూరులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేందుకు ఇంటర్వ్యూ పూర్తిచేశాను. వచ్చే నెల నుంచి అక్కడికి వెళ్లకతప్పడం లేదు.

–పూజిత, ఎంఏ, పీహెచ్‌డీ, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య 
1
1/4

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య 
2
2/4

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య 
3
3/4

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య 
4
4/4

జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement