ప్రధాన మంత్రి పంటల బీమా పరిస్థితి ఏంటి?
– లోక్ సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి పంటల బీమా యోజన కింద సరిగా అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పంటల బీమా యోజన, మార్పు చేసిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్.డబ్లు.బి.సి.ఐ.ఎస్) కింద 2.63 లక్షల మంది రైతులు తమ పంటలకు బీమా నమోదు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఈ పథకం కోసం 2022–23 సంవత్సరంలో 1,09,865 మంది రైతులు 1,16,895 హెక్టార్ల భూభాగానికి నమోదు చేసుకున్నారని తెలిపారు. అలాగే 2023–24లో 1,18,880 మంది రైతులు 1,42,695 హెక్టార్లకు, 2024–25లో 35,553 మంది, 45,507 హెక్టార్ల కు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ పథకం కింద వరి, వేరుశనగ, సజ్జలు, పత్తి, పెసలు తదితర పంటలకు బీమా అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment