అలిగితివా సఖీ!
ఎండీఎం నిర్వాహకుల పొట్ట కొట్టొద్దు
మధ్యాహ్న భోజన నిర్వాహకుల పొట్టకొట్టడం దారుణమని సీఐటీయూ నేతలు మండిపడ్డా రు. ఈ మేరకు నిరసన చేపట్టారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పల్లకీసేవ నయనానందకరంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో శ్రీకాళహస్తి పట్టణంలో సందడి నెలకొంది. పార్వతీదేవి అర్ధాంగిగా చేసుకుని అర్ధనారీశ్వరుడు అయ్యాడు శ్రీకాళహస్తీశ్వరస్వామి. కాగా గంగను శిరస్సుపై ఉంచడాన్ని సహించని పార్వతీదేవి ఆయనపై అలిగి పల్లకీలో ముందుగా వెళుతుండగా ఆమెను వెంబడిస్తూ సర్వేశ్వరుడు రావడం ఈ ఉత్సవం విశేషం. అలిగి వెళుతున్న అమ్మవారి ముందు దర్పణాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అద్దంలో కనిపించే అమ్మవారి సుందరరూపాన్ని చూసి పునీతులయ్యారు. కాగా బుధవారం ఏకాంత సేవ జరగనుంది. – శ్రీకాళహస్తి
పల్లకీ సేవకు పోటెత్తిన భక్తులు (ఇన్‌సెట్) దర్పణంలో అమ్మవారి ప్రతిబింబం
– 8లో
– 8లో
అలిగితివా సఖీ!
Comments
Please login to add a commentAdd a comment