నేటి నుంచి సమ్మె ఉధృతం
తిరుపతి సిటీ: గౌరవ వేతనం పెంచాలంటూ పశువైద్య విద్యార్థులు చేస్తున్న నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా మంగళవారం చేతులు, కాళ్లకు స్వతహాగా బేడీలు వేసుకుని న్యాయదేవత ముందు తమగోడును వెళ్లబోసుకున్నారు. తమ ఆకలి కేకలు వర్సిటీ అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
హాస్టల్స్ బంద్ చేస్తాం
వెటర్నరీ జూడాలు సమ్మెను విరమించని నేపథ్యంలో వర్సిటీలోని హాస్టల్స్‌ను మూసివేస్తామని మరో వైపు అధికారులు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేస్తామని సైతం అధికారులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment