శ్రీవారి తెప్పోత్సవాలకు పటిష్ట భద్రత
తిరుమల: తిరుమలలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు జరగబోయే తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. దీనికి ముందు ఆయన తెప్పోత్సవాలు జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ స్వామి వారి దర్శనమయ్యేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి కెమెరాను కూడా తప్పనిసరిగా చెక్ చేయాలన్నారు. సోమవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దీక్షను గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment