ఉత్తమ సర్పంచ్ సుభాషిణి
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బీ.సుభాషిణి ఉత్తమ సర్పంచ్ అవార్డును స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన సురక్ష పంచాయతీ నేత్రీ అభయాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును కేంద్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అందజేశారు. గత ప్రభుత్వం మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన సుభాషిణి, ఆమె భర్త బీ.శుభగిరినాయుడు పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం వల్లనే ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికై నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
మహిళ మెడలో చైన్ చోరీ
తిరుపతి క్రైమ్: ఓ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన ఘటన మంగళవారం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అలిపిరి ఎస్‌ఐ నాగార్జునరెడ్డి కథనం.. కాటన్ మిల్ ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న రమాదేవి చిన్నపాటి ప్రొవిజన్ షాప్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కొన్ని ప్రోవిజన్స్ కొనేందుకు అక్కడికి చేరుకున్నాడు. ఆపై కొనుగోలు చేసి బిల్లు వేసే సమయంలో ఆ మహిళ మెడలో ఉన్న చైన్ లాక్కొని స్కూటీలో పారిపోయాడు. అయితే మహిళ మాత్రం చైన్ లాగే సమయంలో గట్టిగా పట్టుకోవడంతో అర్ధం చైన్ ఆమె చేతిలోనే మిగిలిపోయింది. సుమారు 16 గ్రాములకు పైగా లాక్కెళ్లినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment