రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): శేషాచల అటవీ ప్రాంతం, మాముండూరు సమీపంలో ఇంజిన్ మొరాయించడంతో జేఎస్‌డబ్ల్యూ గూడ్స్ రైలు ఆగిపోయింది. దీంతో పలు రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. చైన్నె నుంచి గుంతకల్లు మీదుగా కర్ణాటకకు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు రేణిగుంట మండలం చైతన్యపురం సిగ్నల్ దాటగానే మిట్ట ప్రాంతం కావడంతో ఇంజిన్ నిలిచిపోయింది. రేణిగుంట రైల్వే అధికారులకు సమాచారం అందడంతో మరొక ఇంజిన్‌తో అతికష్టం మీద మాముండూరు రైల్వే స్టేషన్‌కు తరలించారు. దీని కారణంగా మంగళవారం రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మరొక ట్రైను రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి.
Comments
Please login to add a commentAdd a comment