
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తిరుపతి క్రైమ్: శ్రీనివాస సేతుపై అధిక వేగంతో వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈస్ట్ ఎస్‌ఐ బాలకృష్ణ కథనం.. మదనపల్లికి చెందిన రామానుజన్ నాయుడు కుమారుడు అభిరామ్ నాయుడు(20) మంగళం రోడ్‌లోని అన్నమయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సునీల్‌కుమార్‌తో కలిసి కాలేజీకి సమీపంలోనే ఓ రూమును అద్దెకి తీసుకొని నివసిస్తున్నారు. అయితే వీరు తిరుచానూరు ఫ్లై ఓవర్ దగ్గర నుంచి లక్ష్మీపురం వైపు వెళుతూ సర్కిల్లో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో అభిరామ్ నాయుడు మృతిచెందాడు. అదేవిధంగా వెనుక కూర్చున్న సునీల్‌కుమార్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అత్యధిక వేగంతో వాహనం నడపడం వల్లే కంట్రోల్ చేయలేక ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జవగా.. అభిరాం నాయుడు ఫ్లైఓవర్ గోడపై వేలాడుతూ ఉండిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment