
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
తిరుపతి సిటీ: విద్యార్థులకు క్రీడరంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, యువత అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ రెఫరీ పానెల్ కోచ్ ఎస్‌కే అబ్దుల్ జలీల్ పిలుపునిచ్చారు. ఏపీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఆర్కే గ్రూప్ అఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆహ్వానం మేరకు మంగళవారం తిరుపతి తుడా సర్కిల్‌లోని స్మార్ట్‌సిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ రెండవ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ క్రీడారంగానిదేనన్నారు. ఆర్కే గ్రూప్ అఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్‌ను విద్యార్థులు వీక్షించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనగని రెడ్డెప్ప, రవిచంద్రబాబు పాల్గొన్నారు.
రసవత్తరంగా క్యారమ్స్ పోటీలు
పోస్టల్ ఉద్యోగులకు జాతీయ స్థాయిలో జరుగుతున్న క్యారమ్స్ పోటీలు రెండవ రోజు రసవత్తరంగా కొనసాగాయి. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణా, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యాణా జట్లు పోటాపోటీగా తలపడ్డారు. మహిళా ఉద్యోగుల క్యారమ్స్ పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment