వైభవంగా కల్యాణోత్సవం
నాగలాపురం: మండలంలోని భద్రావతి వీధిలో వెలసిన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామివారి వార్షిక కల్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరి వేకువజామునే స్వామివారిని సుందరంగా అలంకరించారు. ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజతో ప్రారంభించి, అనంతరం శ్రీ భావనారుషి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 7గంటలకు శ్రీ భావనారుషి స్వామివారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారిని మంగళవాయిద్యాల నడుమ వైభవంగా పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదారులు గజలీలమ్మ, చొప్పా కుమారస్వామి, వారి కుటుంభ సభ్యులు, నారాయణ శెట్టి, పద్మశాలి యువకులు, ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ పర్యవేక్షకులు శ్యామల మధు, మునికృష్ణయ్య తదితరులు ఏర్పాట్లను పర్యావేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment