31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె

Published Thu, Mar 6 2025 1:38 AM | Last Updated on Thu, Mar 6 2025 1:35 AM

31వ ర

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె

● వెటర్నరీ వర్సిటీ ఎదుట బైఠాయించిన జూడాలు ● హాస్టళ్లను మూసివేయడంపై ఆందోళన ● ప్రధాన ద్వారానికి తాళం వేసి నిరసన ● పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత

బెదిరింపులు దారుణం

న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రశాంతంగా సమ్మె చేస్తున్నాం. అయితే వర్సిటీ అధికారలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మహిళా విద్యార్థుల హాస్టళ్లను సైతం మూసివేసి బెదిరింపులకు దిగడం దారుణం. ఇటువంటి అధికారులు దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఉండరు. అయినప్పటికీ గౌరవవేతనం పెంచే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు.

– మీడియాతో వెటర్నరీ విద్యార్థిని

ప్రభుత్వానికి నివేదించాం

విద్యార్థులు సమ్మె విరమించే వరకు హాస్టళ్లను తెరి చేది లేదు. ఇప్పటికే 31రోజుల పాటు సమ్మె చేయడంతో తరగతులు నిలిచిపోయాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వాని నివేదించాం. సమ్మె విరమిస్తేనే అన్నీ పరిష్కారమవుతాయి. విద్యార్థులు ఇప్పటికే విలువైన సమయం వృథా చేసుకున్నారు. – జీవీ రమణ,

ఇన్‌చార్జి వీసీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ

తిరుపతి సిటీ : రాష్ట్రంలో అన్ని విభాగాల వైద్య విద్యార్థులతో సమానంగా గౌరవేతనం అందించాలంటూ గత 31రోజులుగా సమ్మె చేస్తున్న విద్యార్థులపై వర్సిటీ అధికారులు బెదిరింపులకు దిగారు. అందులో భాగంగా హాస్టళ్లను మూసివేశారు. దీంతో ఆగ్రహించిన పశువైద్య విద్యార్థులు బుధవారం ఎస్వీ వెటర్నరీ వర్సిటీని దిగ్బంధం చేశారు. వర్సిటీలోకి అధికారులు, ఉద్యోగులను ప్రవేశించకుండా గేట్లకు తాళాలు వేసి నినాదాలతో హోరెత్తించారు. లగేజీలను గేటు ముందు పెట్టి నిరసన తెలిపారు. సమ్మె విరమిస్తే కానీ, హాస్టళ్లను తెరవమంటూ అధికారులు హెచ్చరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం

వర్సిటీ అధికారులు వ్యవహారశైలిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వీసీ దురుసు ప్రవర్తనతోనే విద్యార్థులు సమ్మె బాట పట్టారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

‘వసతి’కి సుముఖత

విద్యార్థులు, వర్సిటీ అధికారులతో పోలీసులు సుదీ ర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో హాస్టళ్లను తెరిచేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు.

వర్సిటీ వద్ద పోలీసు బలగాలు

వర్సిటీ గేటుకు తాళం వేయడంతో బయట వేచి ఉన్న అధికారులు, ఉద్యోగులు

చుట్టుముట్టిన పోలీసులు

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వర్సిటీ వీసీ, అధికారులు హాస్టల్స్‌ను మూసివేయడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఈ క్రమంలో వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వర్సిటీ ప్రధాన గేటు పైనుంచి సమ్మె చేస్తున్న విద్యార్థుల వద్దకు పోలీసులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో అర్థంకాక మహిళా విద్యార్థులు వణికిపోయారు. విద్యార్థులను నెట్టుకుంటూ వర్సిటీలోకి పోలీసులు ప్రవేశించారు. దీంతో విద్యార్థులు గేటు వద్ద ధర్నా చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె 
1
1/5

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె 
2
2/5

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె 
3
3/5

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె 
4
4/5

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె 
5
5/5

31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement