వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా కామిరెడ్డి
పెళ్లకూరు : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సత్యనారాయణరెడ్డిని రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డికి ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నన్నం ప్రస్కిల్లా, పార్టీ మండల అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం తదితరులు అభినందనలు తెలిపారు.
8న జాతీయ లోక్ అదాలత్
తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో ఈనెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి ఎం.గురునాథ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు లోక్ అదాలత్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్‌లోని సివిల్, రాజీ కాదగిన క్రిమినల్ కేసులతో పాటు వివాహ, మోటారు వాహన ప్రమాదాలు, వ్యాజ్యం వేయని కేసులను పరిష్కరించనున్నట్లు వివరించారు. అదాలత్ కోసం కోర్టు ఆవరణలో 9 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తనతోపాటు ఈ బెంచ్‌లకు అధ్యక్షులుగా తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సునీతారాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ, జూనియర్ జడ్జిలు కోటేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, సత్యకాంత్ కుమార్, సంధ్యారాణి, సరిత వ్యవహరించనున్నట్లు వెల్లడించారు.
మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
తిరుపతి అర్బన్ : ప్రపంచ మహిళా దినోత్సవా న్ని ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాల మైదానంలో ఆటల పోటీలు చేపట్టనున్న నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు కలెక్టర్ ప్రత్యేక సెలవు మంజూరు చేసినట్లు ఏపీ జేఏసీ తిరుపతి చైర్మన్ ఎస్. సురేష్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆటల పోటీ ల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక సెలవు వర్తిస్తుందని వెల్లడించారు.
నేటి నుంచి అన్న ప్రసాదంలో మసాలా వడలు
తిరుమల : తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాద కేంద్రంలో గురువారం నుంచి మసాలా వడలను వడ్డించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా వడల వడ్డన ప్రారంభించనున్నారు.
‘క్వశ్చన్’ మార్క్!
చిల్లకూరు : గూడూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్న అస్పష్టంగా కనిపించింది. ప్రింటింగ్ సరిగా లేకపోవడంతో ప్రశ్నను గుర్తించేందుకు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సమాధానం రాయకపోతే 5 మార్కులు కోల్పోయే ప్రమాదముందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమ పరిస్థితి అర్థం చేసుకుని సక్రమంగి ప్రింట్ కాని ప్రశ్నకు సంబంధించి మార్కులు కలిపితే బాగుంటుందని కోరారు. అధికారులు సైతం జాగ్రత్తలు తీసుకుని ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా కామిరెడ్డి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా కామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment