తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1ఏ, బోటనీ–1, సివిక్స్–1 సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 32,830 మంది, ఒకేషనల్‌లో 1,341 మంది మొత్తం 34,171మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 943 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాగా శుక్రవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2ఏ, బోటనీ–1, సివిక్స్–1 సబ్జెక్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వర కు జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment