ఆత్మరక్షణకే సెల్ప్‌ డిఫెన్స్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణకే సెల్ప్‌ డిఫెన్స్‌ శిక్షణ

Published Fri, Mar 7 2025 9:13 AM | Last Updated on Fri, Mar 7 2025 9:09 AM

ఆత్మరక్షణకే సెల్ప్‌ డిఫెన్స్‌ శిక్షణ

ఆత్మరక్షణకే సెల్ప్‌ డిఫెన్స్‌ శిక్షణ

తిరుపతి ఎడ్యుకేషన్‌ : బాలికల ఆత్మరక్షణ కోసమే పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష సెల్ప్‌ డిఫెన్స్‌ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసినట్లు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ తెలిపారు. తిరుపతిలోని డాక్టర్‌ ఎస్‌ఆర్‌కే నగరపాలక ఉన్నత పాఠశాలలో గురువారం ఈ కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ అనుమతితో విజయవాడకు చెందిన రూపేష్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 475 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదివే 33,618 మంది బాలికలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీవైఈఓ కె.బాలాజీ, డాక్టర్‌ రూపేష్‌బాబు, హెచ్‌ఎం కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement