అభ్యంతరాలు తెలియజేయండి
చిల్లకూరు: క్రిస్ సిటీకి సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా వారంలోగా అందజేయాలని భూములు కోల్పోయిన సాగుదారులకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన సూచించారు. మండల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో సుమారుగా 914 ఎకరాలను తొలి విడతలో క్రిస్ సిటీ కోసం సేకరించారు. ఈ భూములకు పరిహారం అందించడంలో పలు మార్లు నిర్వహించిన గ్రామ సభల్లో విషయం కొలిక్కి రాలేదు. దీంతో ఇటీవల ప్రభుత్వం పరిహారా న్ని రూ.8 లక్షలు చెల్లించేలా ప్రకటించడంతో సాగదారులు కూడా దీనికి అంగీకరించారు. ఈ క్రమంలో సాగుదారుల జాబితాను సిద్ధం చేసి దానిని ఆయా సచివాలయాల్లో ఉంచే క్రమంలో తీగపాళెం వద్ద సాగుదారులతో సమావేశం నిర్వహించారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ సేకరించిన 914 ఎకరాలలో 617 ఎకరాలలో సాగు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన భూమి బీడు గా ఉందని, ఇందులో 617 ఎకరాలకు గాను ఎకరాకు రూ.8 లక్షల చొప్పున పరిహారం అందించేలా ఆదేశాలు అందాయ తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్‌ఐ పూర్ణ, తమ్మినపట్నం, లింగవరం సర్పంచ్‌లు నెల్లిపూడి సుబ్రహ్మణ్యం, నాశిన సుబ్రహ్మణ్యం, వరగలి ఎంపీటీసీ దారా కోటేశ్వరరావు, రూరల్ సీఐ కిశోర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment