
తిరుమల మొదటి ఘాట్‌లో ఏనుగుల గుంపు
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో శుక్రవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఘాట్‌లోని ఏడో మైలు వద్ద రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. వెదురు చెట్లను ధ్వంసం చేశాయి. ఇదే ప్రాంతంలో గురువారం రాత్రి కూడా ఏనుగులు సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వేసవి ప్రారంభ దశ కావడంతో నీటి కోసం వస్తున్నాయా, వెదురు చెట్ల కోసం వస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఘాట్ రోడ్ లో ఏనుగుల సంచారం
Comments
Please login to add a commentAdd a comment