No Headline
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
సత్తా చాటితే!
మాది మదనపల్లి. నా పేరు డాక్టర్ వీ.సుమతి. తిరుపతిలో ఏడీఆర్, ఆర్‌ఏఆర్‌ఎస్ పనిచేస్తున్నాను. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మేము ముగ్గురం ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పురుషులతో సమానంగా మా తల్లిదండ్రులు మమ్ముల్ని ఉన్నత చదువులు చదివించారు. 1984 వరకు ప్రభుత్వ పాఠశాలలోనే ఇంటర్ వరకు చదివాను. ఉన్నత విద్యను తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలోనే పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేశాను. 22 ఏళ్లు పాటు అధ్యాపకురాలిగా పనిచేశా. ఆరేళ్లపాటు రీసెర్చ్ విభాగంలో విధులు నిర్వహించా. ఇదే కళాశాలలో చదివి ఇక్కడే ఆర్‌ఏఆర్‌ఎస్‌కు ఏడీఆర్‌గా పనిచేయడం సంతోషంగా ఉంది.
‘కెరటం నాకు ఆదర్శం.
లేచి పడుతున్నందుకు కాదు..
పడినా కూడా మళ్లీ లేస్తున్నందుకు’
అని అంటున్నారు ఈ మహిళా మణులు. ఆశయం కోసం శ్రమించారు.
లక్ష్యాన్ని నిర్ధేశించుకుని
అడుగులు వేశారు. జీవితమనే
చుక్కానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా
ఎదురొడ్డి పోరాడారు. పురుషులకు
సైతం చదువు అందని ద్రాక్షగా ఉన్న
రోజుల్లోనే పీజీలు, పీహెచ్‌డీలు చేశారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో
సమాజంలో తమకంటూ గుర్తింపు
తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్మించినా
సమాజంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం
సందర్భంగా పలువురు
మహిళా మణుల మనోగతం మీ కోసం ..
– తిరుపతి సిటీ
దృఢసంకల్పమే ఆయుధం
నా పేరు వీ.ఉమ. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ వీసీగా పనిచేస్తున్నాను. మాది తెనాలి. వ్యవసాయ కుటుంబం. నాన్న రైతు. అమ్మ గృహిణి. మేము ముగ్గరం ఆడపిల్లలం. ఒక తమ్ముడు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా నాన్న తమ్ముడితో సమానంగా ఉన్నతంగా చదివించారు. ఆ రోజుల్లోనే పీజీ సోషల్ వర్క్ ముంబైలో పూర్తిచేశాను. మహిళా వర్సిటీకి 1981లో అధ్యాపకురాలుగా రూ.1,500 జీతంతో చేరాను. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. పలు అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు
చేశాను. విదేశీ సదస్సుల్లో పాల్గొని అవార్డులు,
రివార్డులు సాధించాను. వర్సిటీ రెక్టారుగా,
ఇన్‌చార్జి వీసీగా పనిచేశాను.
జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి
మాది భాకరాపేట దగ్గర చిన్న గ్రామం. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. నాన్న రైతు. మేము నలుగురు ఆడపిల్లలం. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడం తక్కువ. ఆ నాడే నలుగురి ఆడపిల్లలను నాన్న చదివించారు. పద్మావతి కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. పీజీ, పీహెచ్‌డీ ఎస్వీయూలో చేశా. అదే కలాశాలలో అధ్యాపకురాలిగా చేరా. సుమారు 33 ఏళ్లపాటు అధ్యాపకురాలకుగా పనిచేశా. ప్రస్తుతం అదే కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేయడం ఆనందంగా ఉంది.
–డాక్టర్ టీ.నారాయణమ్మ, ప్రిన్సిపల్,
ఎస్పీడబ్ల్యూ కళాశాల, తిరుపతి
అద్భుతం..ఆదర్శం
తిరుపతి రూరల్: మండలంలోని చెర్లోపల్లి సర్పంచ్ సుభాషిణి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కఠోర శ్రమతో గ్రామరూపు రేఖలు మార్చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలో అమలు చేస్తూ అభివృద్ధికి బాటలు వేశారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు పంచాయతీ కార్యదర్శిని కూడా పరుగులు పెట్టించారు. భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి వీధిలో సిమెంటు రోడ్డు, వీధి దీపాలు, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల వద్ద మొక్కలు నాటించడం, ఉద్యానవనాలు అభివృద్ధి తదితర చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఉత్తమ సర్పంచ్ అవార్డుతో సత్కరించింది.
కష్టే ఫలి
మాది కృష్ణా జిల్లా పామర్రు, నాన్న వెటర్నరీ డాక్టర్‌గా రిటైర్డ్ అయ్యారు. తల్లి గృహిణి. మేము ఇద్దరం ఆడపిల్లలం. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగింది. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో శ్రమించాం. ప్రతి విద్యార్థినీ తమ సృజనాత్మక శక్తిని వెలికితీసి తాము ఎంపిక చేసుకున్న రంగంలో రాణించాలి. మనలో సత్తాలేకుంటే సమాజమేకాదు.. ఇంటిలోనూ, బంధుమిత్రుల దగ్గర గుర్తింపు ఉండదు.
డాక్టర్ సీహెచ్ శ్రీలత, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ
న్యూస్‌రీల్
No Headline
No Headline
No Headline
No Headline
No Headline
No Headline
Comments
Please login to add a commentAdd a comment