కుటుంబ వ్యవస్థకు మూలం సీ్త్ర
తిరుపతి కల్చరల్: సమాజంలో కుటుంబ వ్యవస్థకు మూలం సీ్త్ర అని, మహిళల భాగస్వామ్యంతో సమాజంలో సంపదను సృష్లించవచ్చని టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్యచౌదరి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాళ్లు రంగశ్రీ, జానకీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ప్రముఖ వైద్యరాలు డాక్టర్ రేఖ మాట్లాడుతూ ఎవరి జీవితానికి వారే కర్త, కర్మ, క్రియలని చెప్పారు. ప్రముఖ వక్త రాజేశ్వరి మాట్లాడుతూ హైందవ సనాతన సంస్కృతిలో మహిళకు విశేషమైన స్థానం ఉందన్నారు. హైదరాబాద్ సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలాలత, అర్జున్ అవార్డు గ్రహీత జీవనజీదీప్తి మాట్లాడుతూ ఆశయం బలంగా ఉండాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలంస్తున్న 12 మంది మహిళా ఉద్యోగులను సన్మానించి, 5 గ్రామలు వెండి డాలర్, శ్రీపద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. అలాగే ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న 63 మంది మహిళా ఉద్యోగులను సత్కరించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, వీణ వాయిద్య కచేరి ఆకట్టుకుంది. డీఎల్‌ఓ వరప్రసాద్, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ ఆనందరాజు, బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ ప్రశాంతి, పలువురు మహిళా డెప్యూటీ ఈఓలు పాల్గొన్నారు.
కుటుంబ వ్యవస్థకు మూలం సీ్త్ర
Comments
Please login to add a commentAdd a comment