
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చంద్రగిరి: రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలు రాణించాల్సిన ఆవశ్యకత ఉందని చిత్తూరు జిల్లా జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని ఐతేపల్లి, అగరాల పంచాయతీ సర్పంచ్‌లు ఫాజిలా, అగరాల భాస్కర్ రెడ్డిల అధ్యక్షతన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఐతేపల్లి ఎంపిక కావడం శుభపరిణామమన్నారు. అనంతరం మహిళా డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ టెక్నాలజీలో మహిళల పాత్ర గురించి వివరించారు. తర్వాత మహిళలను వారు ఘనంగా సత్కరించారు. డీపీఓ సుశీలాదేవి, ఎంపీడీఓ శేఖర్, ఎంఈఓ లలితకుమారి, ఈఓఆర్డీ వెంకటరత్నం, ఏపీఎం గంగయ్య, మెడికల్ అధికారిణి డాక్టర్ ప్రియాంక పాల్గొన్నారు.
15 నుంచి ఇంటర్ మూల్యాంకనం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ చేపట్టనున్నట్టు ఆర్‌ఐవో జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇది వరకే సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించి మూల్యాంకనం చేపట్టినట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి సబ్జెక్టుల మూల్యాంకనానికి ఇంటర్ బోర్డు నుంచి అధ్యాపకులకు ఉత్తర్వులు రానున్నాయని తెలిపారు. ఉత్తర్వులు అందుకున్న ప్రతి అధ్యాపకుడు విధిగా స్పాట్ వాల్యుయేషన్‌కు హాజరుకావాలని కోరారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment