
డివైడర్‌ను ఢీకొన్న కారు
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి తాళ్వాయిపాడు గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి గుడివాడ వెళుతున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీష్‌కుమార్(40) మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు.. సతీష్‌కుమార్ తన స్నేహితురాలు శిరీషాతో కలిసి కారులో బెంగళూరు నుంచి గుడివాడకు వెళుతున్నారు. మార్గ మధ్యంలో తాళ్వాయిపాడు గ్రామం వద్ద ప్రమాద వశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్‌కుమార్ మృతి చెందాడు. రక్త గాయాలైన శిరీషాను నెల్లూరు తరలించారు. మృతునికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ
నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో పెన్నేపల్లి గ్రామ సమీపంలో ఉన్న అరబిందో అపార్ట్‌మెంట్ వద్ద శనివారం తెల్లవారు జామును ఆగి ఉన్న ట్రావెల్ బస్సును లారీ ఢీట్టింది. ఈ ఘటనలో పర్విన్ అనే మహిళకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న ఎన్‌వీడీటీ ట్రావెల్ బస్సు మార్గ మధ్యంలో పెన్నేపల్లి గ్రామ సమీపంలో అరబిందో అపార్ట్‌మెంట్ వద్ద ప్రయాణికుల కాలకృత్యాల నిమిత్తం రోడ్డు పక్కగా ఆగింది. అదే మార్గంలో వెళుతున్న లారీ ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పర్విన్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన పర్విన్‌ను చికిత్సల నిమిత్తం నాయుడుపేటకు తరలించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
Comments
Please login to add a commentAdd a comment