సీసీ కెమెరాలతో నిఘా
నాయుడుపేట టౌన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందిని ఆదేశించారు. నాయుడుపేట పోలీస్ డివిజన్ కార్యాలయం, అర్బన్, రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలన్నారు. మహిళలు వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వస్తే తక్షణం స్పందించాలని చెప్పారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసేలా ఈగల్ టీం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డీఎస్పీ చెంచుబాబు, సీఐలు బాబి, సంగమేశ్వర రావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment