యువత పోరుకు తరలిరండి
తిరుపతి లీగల్: జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని ఆ పార్టీ లీగల్ సెల్ తిరుపతి అధ్యక్షుడు దొరబాబు (మునిబాల సుబ్రమణ్యం) ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉద్యోగాల కల్పన లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనల బకాయిలు చెల్లించకుండా, వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బకాయిలు చెల్లించేలా ‘యువత పోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్ట పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షకు
941 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 32,541మంది, ఒకేషనల్‌లో 1,357మంది మొత్తం 33,898 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 941 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా బుధవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పని ఒత్తిడి తగ్గించండి
ఏర్పేడు(రేణిగుంట): తమకు సర్వేల పేరుతో పనిభారం మోపొద్దని ఏర్పేడు ఎంపీడీవో సౌభాగ్యంకు మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు షఫీవుల్ల, కోశాధికారి లోకముని ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. అన్ని శాఖల పనులు తమకే చెప్పి సర్వేలను పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.
పిచ్చాటూరు అంగన్‌వాడీ కార్యకర్తకు బ్రెయిన్ స్ట్రోక్
– ధర్నా కోసం విజయవాడకు వెళ్లి
కుప్పకూలిన వైనం
నాగలాపురం: పిచ్చాటూరు అంగన్‌వాడీ కార్యకర్త బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఆమె తోటి అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి ఆదివారం విజయవాడలో జరిగిన మహాధర్నాకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం ధర్నా చేపట్టడానికి తోటి కార్యకర్తలతో కలిసి అలంకార్ ప్రాంగణానికి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు చిన్నమెదడు చిట్లిపోయి రక్తం గడ్డకట్టినట్టు నిర్ధారించారు. కనీసం 24 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని చెప్పలేమని వైద్యులు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వాణిశ్రీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
15న జాబ్‌మేళా
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 15న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, ప్రిన్సిపల్ నాగరాజునాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్త, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్, సీడాఫ్, డీఆర్‌డీఏ, జేకేసీ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. పలు బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పదోవ తరగతి, ఇంటర్మీడియెట్, ఐఐటీ, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి యువతీయువకులు అర్హులని తెలిపారు. ఇంటర్‌ూయ్వలకు హాజరయ్యే వారు ఆధార్, విద్యార్హత సర్టిపికెట్స్ జిరాక్సులు, బయోడేటాతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ లింక్‌లో నమోదు చేసుకున్ని అడ్మిట్ కార్డుతో జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7989509540, 8919889609 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
యువత పోరుకు తరలిరండి
Comments
Please login to add a commentAdd a comment