జిల్లాలో మూడు ఇసుక పాయింట్లు
తిరుపతి అర్బన్: జిల్లాలో ఈనెల 15వ తేదీలోపు మూడు ఉచిత ఇసుక పాయింట్లు (స్వర్ణముఖినది ఆధారంగా)అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలసి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోట మండలం, గూడలి వద్ద ఒక ఇసుక పాయింట్, పెళ్లకూరు మండలం, పుల్లూరు సమీపంలో రెండు ఇసుక పాయింట్లు గుర్తించామని చెప్పారు. ఈ మూడు పాయింట్ల నుంచి 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోడుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే డీసిల్టేషన్(ఇసుక పాయింట్ల) వద్ద ఇసుక తవ్వడానికి, రవాణా చేయడానికి ఏజెన్సీలను నియమించినట్టు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుని నేరుగా ఇసుక పాయింట్ల వద్దకు వెళ్లి రుసుం చెల్లించి ఇసుక తీసుకుపోవాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇసుక పాయింట్ల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఇసుక పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తడ, గాదంకి, సురుటుపల్లి చెక్స్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్‌రెడ్డి, జిల్లా గనులశాఖ అధికారి బాలాజీ నాయక్, గూడూరు ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ టీడీ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ఇసుక పై స్పష్టత ఏదీ?
కూటమి సర్కార్ జూలై 8న ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. గతంలో ఇసుక ఉచితం అని చెప్పినా జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్ల వద్ద టన్నుల లెక్క విక్రయించారు. జూలై 8న జిల్లాలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక పాయింట్లు మూతపడ్డాయి. ఆ తర్వాత ఆరు నెలలకు మళ్లీ ఉచిత ఇసుక గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఏర్పాటు చేస్తామన్న మూడు పాయింట్లను ఏజెన్సీకి ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఏజెన్సీకి ఏ పద్ధతిలో ఇస్తున్నారో క్లారిటీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment