రాజకీయ ప్రాధన్యత పెరగాలి
తిరుపతి సిటీ: మహిళలకు రాజకీయ ప్రాధాన్యత పెరినప్పుడే సమాజంలో సీ్త్రకి సమానత్వం నిర్మితమవుతుందని వీసీ సీహెచ్ అప్పారావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ ఉమెన్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకులు మంగళవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సాంకేతిక యుగంలోనూ మహిళలపై వివక్ష తగదన్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అభ్యంతరకర పోస్టులు పెడుతుండటం దారుణమన్నారు. అనంతరం చిత్ర లేఖనం, వక్తృత్వ పోటీలు, ఎగ్జిబిషన్, లింగ సమానత్వం, హింసలపై విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. విభాగాధిపతి డాక్టర్ సాయి సుజాత, డీఎస్పీ శ్రీలత, ప్రొఫెసర్ భాస్కర్‌రెడ్డి, డాక్టర్ రమణ, డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment