తిరుపతి సిటీ : న్యాయమైన డిమాండ్‌లతో 45 రోజులుగా సమ్మె చేస్తుంటే అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు మండిపడ్డారు. బుధవారం వారు మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసమే సమ్మెకు దిగినట్టు వెల్లడించారు. యూజీ విద్యార్థులకు రూ.10,500, పీజీ విద్యార్థులకు రూ.13,500, పీహెచ్‌డీ వారికి రూ.15వేలకు స్టయిఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం తమకు సమ్మతం కాదన్నారు. వైద్యరంగంలోని అన్ని విభాగాల్లో విద్యార్థులతో సమానంగా గౌరవ వేతనం అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓను వెనక్కుతీసుకోవాలని కోరారు. లక్ష్యం నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు.