సాఫ్ట్ స్కిల్స్‌పై అవగాహన
తిరుపతి సిటీ : ఎస్వీయూ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో కామర్స్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు బుధవారం సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత, పరిశోధన కోసం ఫెలోషిప్స్ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ పీవీ నరసయ్య మాట్లాడుతూ స్కిల్స్ డెవలప్‌మెంట్, పరిశోధనలో మెళకువలను వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళీధర్, డాక్టర్ కళ్యాణ్ కుమార్, డాక్టర్ వివేక్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముగిసిన అంతర్జాతీయ వర్క్‌షాపు
తిరుపతి సిటీ:తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో శ్రీహర్ష ఖండన ఖండ ఖాద్య గ్రంథ అధ్యయనంపై 10 రోజుల అంతర్జాతీయ వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. ఈ వర్క్‌షాప్‌లో పాత గురుకుల శైలిలో బోధన, చింతనం, అనువాదం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముగింపు కార్యక్రమంలో వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, ప్రత్యేక అతిథి ఆచార్య మణి ద్రావిడ శాస్త్రి, అధ్యాపకులు మాట్లాడారు.
ఇంటర్న్‌షిప్ కోసం
అవగాహన ఒప్పందం
తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో బుధవారం విద్యార్థుల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం జగతి నెట్‌వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జగతి నెట్‌వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జె.వాసుదేవ నాయుడు, బి.సులోచనరాణి, పి.చంద్రయ్య, సృజన పాల్గొని ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ప్రొపర్టీ రైట్స్‌పై అవగాహన
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఎం.ఉషారాణి, కె.చందనశ్రీ ఆధ్వర్యంలో బుధవారం ప్రొటెక్టింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఐపీ మేనేజ్‌మెంట్ ఫర్ స్టార్టప్స్‌పై సెమినార్ నిర్వహించారు. ఇందులో రిసోర్స్‌పర్సన్‌గా విక్రమ సింహపురి వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కోటా నీలమణికంఠ పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రాపర్టీ రైట్స్, ట్రెడ్ మార్క్స్, పేటెంట్స్ అండ్ పబ్లికేషన్స్ అనే అంశాలపై అవగాహన కల్పించారు.
సాఫ్ట్ స్కిల్స్‌పై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment