ముగిసిన వేద సమ్మేళనం
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విజ్ఞాన ప్రతిష్ఠాన్ ఉజ్జయినీ సంయుక్తంగా మూడు రోజులుగా వర్సిటీలో నిర్వహిస్తున్న వేద సమ్మేళనం బుధవారం ముగిసింది. వేద సమ్మేళనానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వేద పండితులు 100 మందికి పైగా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా కంచి శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి మహా విశ్వవిద్యాలయం కులపతులు జీ. శ్రీనివాస శర్మ, సాందీపని వేద విజ్ఞాన పీఠం సచివులు డాక్టర్ విరూపాక్ష జెడ్డిపాల్ ప్రసంగించారు. వేదాలు భారతీయ సంస్కృతికి మూలాలని, వాటిని కాపాడుకోవడానికి సాంకేతిక విద్యను అభ్యసించాలన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,000 విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని, ఈ సంఖ్యను 1,11,000 పెంచి వేద పండితులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వర్సిటీ అధికారులు అతిథులను సత్కరించారు. సమ్మేళనంలో వీసీ రాణి సదాశివమూర్తి, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి, రిజిస్ట్రార్ పి భాస్కరుడు, సంచాలకులు డాక్టర్ తారకరామశర్మ, డీన్ సుబ్రమణ్యశర్మ, గణేష్ భట్, పురుషోత్తమాచార్యులు, ఆచార్య రాఘవన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment