నేడు సంస్కృత వర్సిటీ స్నాతకోత్సవం
తిరుపతి సిటీ : తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గురువారం జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. సంస్కృత భాషను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా జాతీయ సంస్కృత వర్సిటీ పనిచేస్తోందన్నారు. స్నాతకోత్సవంలో ఆచార్య ఎంఏ, ఎమ్మెస్సీ, బీఏ, బీఎస్సీ, యోగాథెరపిలో 546 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే 75 మందికి పీహెచ్‌డీ, 42 మందికి బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్టు వివరించారు. సంస్కృత భాషను నేర్పించేందుకు బాల వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2,242 మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను అందించనున్నట్టు తెలిపారు. స్నాతకోత్సవానికి మాజీ చాన్సలర్, ఆర్థిక వేత్త, పద్మశ్రీ డాక్టర్ వీఆర్ పంచముఖి, ఎన్‌ఎస్‌యూ చాన్సలర్ పద్మభూషణ్ గోపాలస్వామి హాజరవుతారని తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సాంబశివమూర్తి, ఓఎస్‌డీ రఘునందన్, పీఆర్‌ఓ ప్రొఫెసర్ రమేష్, ఏపీఆర్‌ఓలు డాక్టర్ కే కుమార్, బల్టీదాస్, డాక్టర్ నందనరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment