పుత్తూరు: స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఈఎస్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా బుధవారం చేసిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిచ వారి వద్ద నుంచి రూ.9,600 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ బి.మురళీమోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వడమాలపేట గ్రామంలోని గుంటకట్టవీధిలో నివాసమున్న వల్లెమ్మ(45) ఇంట్లో దాడి చేయగా ఇంట్లో 700 గ్రాముల గంజాయి దాచి ఉండగా గుర్తించి, దానితోపాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో వల్లెమ్మ(45), ఆమె కుమారుడు ఢిల్లీప్రసాద్(27)ను అరెస్టు చేశారు. వల్లెమ్మ గతంలోనూ గంజాయి కేసులో పట్టుబడి, ఏడాది జైలుశిక్ష అనుభవించి విడుదలైంది. ఈమైపె నిఘా ఉంచడంతో మళ్లీ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్టు చేశారు. దాడుల్లో సీఐ మురళీమోహన్, ఎస్‌ఐలు శివప్రసాద్, స్వామినాధన్, సిబ్బంది రవి, చంద్రశేఖర్, మునిరెడ్డి, డేవిడ్, చిరంజీవి, మోహతాజ్, హారతిలు పాల్గొన్నారు.

గంజాయి విక్రేతల అరెస్టు