
నేడు తిరుపతి ఐఐటీ 10వ వ్యవస్థాపక దినోత్సవం
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో శుక్రవారం 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఐఐటీని 2015లో తిరుపతి సమీపంలో తాత్కాలిక భవనంలో ప్రా రంభించామన్నారు. మద్రాసు ఐఐటీ సహకారంతో తరగతులు ప్రారంభించినట్టు తెలిపారు. ఏర్పేడు సమీపంలోని 548 ఎకరాల్లో అధునాతన హంగులతో శాశ్వత ప్రాంగణాన్ని నిర్మించుకున్నట్లు చెప్పారు. 35 ఎకరాల్లో సౌత్ క్యాంపస్‌లో క్లాస్ రూమ్స్, హాస్టల్, ల్యాబ్స్, స్పోర్ట్స్ క్లబ్‌లను నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2017లో ఎంఎస్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2018లో ఎంఎస్‌సీ ప్రవేశాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం తి రుపతి ఐఐటీ క్యాంపస్‌లో 1,667 మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారన్నారు. 1.26 లక్షల మీటర్ల విస్తీర్ణంలో ఫేస్–ఏ క్యాంపస్ నిర్మాణాలు పూర్తి చేసినట్టు చెప్పారు. ఐఐటీ క్యాంపస్ శేషాచలం కొండకు దిగువున ఉన్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో రెండు నీటి సరస్సులు, 80 మిలియన్ లీటర్ల కెపాసిటీతో రెయిన్ వాటర్ ప్లాంట్‌ను ఏ ర్పాటు చేసుకున్నామన్నారు. దీనికి జాతీయస్థాయి అవార్డును కూడా వచ్చిందన్నారు. 1 మెగా వాట్ రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎకో ఫ్రెండ్లీ పరిసరాలను రూపొందించడంలో భాగంగా, 1.10 లక్షల పూలమొక్కలు, 260 ఔషధ మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. వ్యవ స్థాపక దినోత్సవంలో ఐఐటీ శాశ్వత ప్రాంగణ నిర్మాణ సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఎండీ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ విశేష కృషి
ఏర్పేడు సమీపంలో 548 ఎకరాల్లో ఐఐటీ శాశ్వత ప్రాంగణం నిర్మాణంలో విభిన్న శైలి, అధునాతన వసతుల కల్పనలో డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ కృషి ఎంతో ఉంది. ఆయన అనునిత్యం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిబ్బందిని సమన్వ యం చేసుకుని ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకోవటంలో సఫలీకృతులయ్యారు.

నేడు తిరుపతి ఐఐటీ 10వ వ్యవస్థాపక దినోత్సవం