వ్యక్తి మృతి
నాయుడుపేట టౌన్: ఇసుక ట్రాక్టర్‌ను మోటారు బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. అయ్యప్పరెడ్డిపాళెం మిక్సిడ్ కాలనీకి చెందిన పులయ్య(26) ఆదివారం రాత్రి మోటారు బైక్‌పై నాయుడుపేట నుంచి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యంలోని తుమ్మూరు వద్ద ఇసుక లోడ్డుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా మలుపు తిరగడంతో అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొనింది. తీవ్రంగా గాయపడిన పుల్లయ్య గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఈగా సునీత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
రాపూరు: మోటారు సైకిల్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రాపూరు– మద్దెల మడుగు మధ్యలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రాపూరుకి చెందిన బొజ్జా కోటేశ్వరరావు (35) మద్దెల మడుగు నుంచి రాపూరుకు ద్విచక్ర వాహనంలో వస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు సైకిల్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.