
ఎనిమిది గేదెలు మృతి
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి, టెంకాయతోపు గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎనిమిది గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానిక ఎస్‌ఐ నాగరాజు వివరాల మేరకు.. టెంకాయతోపు గ్రామం వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై గుర్తు తెలియని వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో ఎనిమిది గేదెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయన్నారు. మృతి చెందిన గేదెలు ఎవరికి సంబంధించినవి అనే విషయంపై కూడా సమాచారం లేదన్నారు.
టెన్నికాయిట్ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక
గూడూరు రూరల్: తిరుపతి జిల్లా టెన్నికాయిట్ నూతన కార్యవర్గాన్ని తిరుపతిలోని అను ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ టెన్నికాయిట్ రాష్ట్ర చైర్మన్ వైడీ.రామారావు, రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర అబ్జర్వర్ ఎన్‌టీ.ప్రసాద్, డీఎస్డీఓ షేక్ సయ్యద్‌సాహెబ్, రిటర్నింగ్ అధికారి (అడ్వకేట్) డాక్టర్ సీ.చంద్రశేకర్ పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్టు సభ్యులు పేర్కొన్నారు. టెన్నికాయిట్ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ బండి శ్యాంసుందరరావు, ఉపాధ్యక్షులుగా కోటేశ్వరరావు, కావలి మల్లికార్జున్, కార్యదర్శిగా గెరిటి చెంచయ్య, గూడూరు రమేష్, రాంబాబు, మహేష్, అరుణ్‌కుమార్, మునిరాజ, సీహెచ్ విజయలక్ష్మి, జగీదశ్వరరావు, మంజులను ఎంపిక చేసినట్టు తెలిపారు.
1, 2 తేదీలలో వాచీల ఈ– వేలం
తిరుపతి కల్చరల్: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో భక్తు లు కానుకగా సమర్పించిన వాచీలను మే 1, 2 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ– వేలం నిర్వహించనున్నారు. మొ త్తం 62 లాట్లు ఈ వేలంలో ఉంచినట్లు టీటీడీ పీఆర్వో టి.రవి ఒతెలిపారు. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కా ర్యాలయం ఫోన్ నెంబర్ –0877–2264429 ద్వారా లేదా టీటీడీ వెబ్‌సైట్, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

ఎనిమిది గేదెలు మృతి