హాల్‌టికెటొచ్చింది! | - | Sakshi
Sakshi News home page

హాల్‌టికెటొచ్చింది!

Published Thu, Apr 24 2025 1:32 AM | Last Updated on Thu, Apr 24 2025 1:32 AM

హాల్‌

హాల్‌టికెటొచ్చింది!

హమ్మయ్యా..
డిగ్రీ పరీక్షలకు తొలగిన అడ్డంకులు
● ఎస్వీయూ హాల్‌టికెట్ల జారీలో గందరగోళానికి తెర ● అందుబాటులోకి నూతన హాల్‌టికెట్ల ● జ్ఞానభూమి పోర్టల్‌ నిర్లక్ష్యమే కారణం

తిరుపతి సిటీ: ఎస్వీయూ హాల్‌ టికెట్ల జారీలో గందరగోళానికి తెరపడి, ఎట్టకేలకు విద్యార్థులకు హాల్‌టికెట్ల అందుబాటులోకి తెచ్చారు. ఎస్వీయూ పరిధిలో హాల్‌టికెట్ల జారీలో గందరగోళంగా మారడం, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లలు తప్పుల తడకగా ఉండటంతో విద్యార్థులలో అయోమయం నెలకొంది. దీంతో ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసి వచ్చేనెల 12, 14వ తేదీల్లో నిర్వహించనున్నారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా తప్పుల తడకగా జారీ చేసిన హాల్‌ టికెట్లను రద్దు చేసి, సరి చేసిన నూతన హాల్‌టికెట్లను మంగళవారం రాత్రి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

జ్ఞానభూమి పోర్టల్‌తోనే గందరగోళం

ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న జ్ఞానభూమి పోర్టల్‌ సాంకేతిక లోపంతోనే డిగ్రీ హాల్‌టికెట్ల జారీలో తప్పులు దొర్లినట్టు వర్సిటీ అధికారులు గుర్తించారు. హాల్‌టికెట్ల జారీలో జరిగిన గందరగోళంపై వర్సిటీ అధికారులు విచారణ చేపట్టి ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం జరిగినట్లు గుర్తించారు. జరిగిన తప్పులు వెంటనే సరిచేసి నూతన హాల్‌టికెట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. దీంతో గందరగోళానికి తెరపడింది. బుధవారం హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రక్రియలో విద్యార్థులు తలమునకలై ఉన్నారు. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలకు ఒకరోజు ముందు ఇలాంటి అయోమయపరిస్థితులు నెలకొనడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకింత అసహనానికి గురయ్యారు.

వివాదాస్పదంగా మారుతున్న పరీక్షల విభాగం

డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్‌ పరీక్షల సమాచారం

ఎస్వీయూ పరిధిలో ప్రైవేటు,

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు 124

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 15

టీటీడీ డిగ్రీ కళాశాలలు 4

పరీక్షా కేంద్రాలు 64

2వ సెమిస్టర్‌ రాస్తున్న విద్యార్థులు

11,540 మంది

4వ సెమిస్టర్‌ పరీక్షలకు

హాజరవుతున్న విద్యార్థులు 12,067

సాంకేతిక లోపమే కారణం

డిగ్రీ హాల్‌టికెట్ల జారీలో తప్పులు దొర్లిన మాట వాస్తవం. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ పోర్టల్‌లో సాంకేతిక లేపంతో హాల్‌టికెట్లలో గందరగోళం ఏర్పడింది. వెంటనే తప్పులను సరిదిద్ది నూతన హాల్‌టికెట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచాం. తొలి రెండు పరీక్షలను వాయిదా వేశాం. మిగిలిన పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల్లో వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించనున్నాను. ఇప్పటికే వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశాం.

– ప్రొఫెసర్‌ సీహెచ్‌ అప్పారావు, వీసీ, ఎస్వీయూ

ఎస్వీయూ పరీక్షల విభాగం ప్రతిసారీ వివాదాస్పదంగా మారుతోంది. పరీక్షల ఫలితాల విడుదలలో జాప్యం, పరీక్షల నిర్వహణ, రీవాల్యుయేషన్‌, ధ్రువపత్రాల జారీ తదితర విషయాల్లో ప్రతిసారీ ఏదో రకంగా వివాదాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల హాల్‌టికెట్ల జారీ విషయంలోనూ మరోసారి ఎగ్జామినేషన్‌ సెక్షన్‌పై విద్యార్థులు మండిపడుతున్నారు. జ్ఞాన భూమి పోర్టల్‌లో సాంకేతికలోపం అనడం కంటే ఉద్యోగులు పోర్టల్‌లో హాల్‌టికెట్లు అప్‌లోడ్‌ చేయడంలో జరిగిన నిర్లక్ష్యమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో ఇటీవల అధికారులు అర్హత, అనుభవం ప్రామాణికంగా తీసుకోకుండా ఉద్యోగులను పలు సెక్షన్ల నుంచి పెద్ద ఎత్తున బదిలీలు చేయడమేననే వారు విమర్శిస్తున్నారు.

హాల్‌టికెటొచ్చింది!1
1/1

హాల్‌టికెటొచ్చింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement