
మహిళా వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులు ప్రదానం
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు, ప్రోగ్రాం ఆఫీసర్లకు మంగళవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ రజిని చేతుల మీదు గా అవార్డులను, పశంసాపత్రాలను అందజేశారు. బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అవార్డు డాక్టర్.యువ, డాక్టర్ పద్మ, బెస్ట్ యూనిట్ అవార్డు డాక్టర్ వజిహాభాను, డాక్టర్ కే.రుక్మిణి, బెస్ట్ పీఓ సెకండ్ రన్నరప్‌గా డాక్టర్ హేమావతి, డాక్టర్ భారతి, అప్రిషియేషన్ అవార్డును డాక్టర్ అనిత అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ బెస్ట్ వలంటీర్‌గా ఎం.రమ్యకు, 22మంది వలంటీర్లకు అప్రిసియేషన్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సైన్‌న్స్ డీన్లు టీ.సుధా, విజయలక్ష్మి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గంగా భవాని, కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ మల్లికార్జున, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఐవీ లలిత కుమారి పాల్గొన్నారు.