
కక్ష సాధింపులను సహించం
వెంకటగిరి (సైదాపురం) : వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోవెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి,సైదాపురం, రాపూరు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అఽధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు కల్యాణి, వహిదా, సుకన్య, ఆటంబాకం శ్రీనివాసులు, ఆరి శంకరయ్య, బాలాయపల్లి, డక్కిలి, సైదాపురం మండల కన్వీనర్ వెందోటి మధుసూదన్‌రెడ్డి, మన్నారపు రవికుమార్ యాదవ్, చింతల శ్రీనివాసులరెడ్డి, నేతలు పూజారి శ్రీనివాసులు, మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.