
ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
తిరుపతి కల్చరల్: ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో యూనియన్ జల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు 14వేల మంది ఉన్నారని, 12 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మహిళా కార్మికులకు పని గంటల విధానం అమలు చేయాలని కోరారు. పెన్షన్, పీఎఫ్ సౌకర్యం కల్పించడంతో పాటు హెచ్‌ఆర్‌పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక చేశారు. గౌరవాధ్యక్షుడిగా రాధాకృష్ణ, అధ్యక్షులుగా శ్రీదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అయ్యప్ప నాయుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా వీర రాఘవయ్య, శంకర్, సుబ్రమణ్యం, వెంకటచలం, శ్రీనివాసులు, సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కార్యదర్శిగా అనంతరావ్, సహాయ కార్యదర్శులుగా సుకుమార్, కళావతి, రవి, లక్ష్మి, వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సుబ్రమణ్యం ఎంపికయ్యారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.శ్రీధర్,ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ పాల్గొన్నారు.