
గంజాయి విక్రేత అరెస్ట్
తిరుపతి క్రైమ్:తిరుపతిలో గంజాయి విక్రయిస్తు న్న ఓ వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎకై ్స జ్ సీఐ రామచంద్ర తెలిపారు. నిందితుడిని శెట్టిప ల్లె రాజీవ్‌గాంధీకి చెందిన సోమశేఖర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
అడవిలోకి చొరబడిన వ్యక్తి అరెస్ట్
తిరుపతి మంగళం : భాకరాపేట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి చొరబడిన వ్యక్తిని మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిడి లేని గొడ్డలి, బరసెలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జి.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ వై.విశ్వనాథ్ బృందం భాకరాపేట చామల సెక్షన్‌లో కూంబింగ్ చేపట్టారు. తిరుపతి–పీలేరు రోడ్డు ఉత్తరం వైపున నిషేధిత అటవీ ప్రాంతంలో ముగ్గురు వెళుతూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు అడవిలోకి పారిపోయారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. పరారైన వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి విక్రేత అరెస్ట్