రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన తల్లి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన తల్లి

May 17 2023 1:05 AM | Updated on May 17 2023 1:05 PM

ఐసీడీఎస్‌ అధికారుల చెంత మగ శిశువు  - Sakshi

ఐసీడీఎస్‌ అధికారుల చెంత మగ శిశువు

షాద్‌నగర్‌: రెండు రోజుల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లింది.. ఈ సంఘటన ఫరూఖ్‌నగర్‌ మండలం విఠ్యాల గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. అయితే వేడి గాలులకు తట్టుకోలేని ఆ శిశువు రోధించడం మొదలు పట్టింది. దీంతో అటుగా వెళుతున్న మహిళలు శిశువు అక్కున చేర్చుకొని పాలు తాపారు.

అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శిశువులను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించడంతో వారు శిశువిహార్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement