Telangana Crime News: వారం రోజులు దాటింది.. మా బిడ్డ జాడ చెప్పండి!
Sakshi News home page

వారం రోజులు దాటింది.. మా బిడ్డ జాడ చెప్పండి!

Published Sun, Aug 27 2023 4:14 AM | Last Updated on Sun, Aug 27 2023 2:15 PM

- - Sakshi

రంగారెడ్డి: కళాశాల హాస్టల్‌ నుంచి తమ కుమారుడు అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మిస్సింగ్‌కు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శనివారం స్టూడెంట్‌ యూనియన్లతో కలిసి ఆందోళన చేపట్టారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్‌ విద్యాసంస్థల్లో డిప్లొమా సెకండియర్‌ చదువుతున్న ఆంజనేయులు.. ఈనెల 20న కళాశాలకు చెందిన హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వారం రోజులుగా కుమారుడి జాడ లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, యాజమాన్యం స్పందించి ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement