
జోష్
బీఆర్‌ఎస్
● రైతు దీక్షకు తరలివచ్చిన జనం
● ఆమనగల్లులో కేటీఆర్ భారీ ర్యాలీ
● విజయవంతమైన కార్యక్రమం
● పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు దీక్ష సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ చౌరస్తా నుంచి దీక్ష శిబిరం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో కేటీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేదికపైకి చేరుకోగానే సీఎం.. సీఎం అంటూ నినాదాలు హోరెత్తాయి. దీక్షలో అరగంటపాటు మాట్లాడిన ఆయన తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు.
సమస్యలు పట్టించుకోవడం లేదు
పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు తప్పితే రాష్ట్ర సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతే పాలమూరు జిల్లాకు సాగునీరు అందిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గంప వెంకటేశ్, దశరథ్‌నాయక్, పత్యానాయక్, జీఎల్‌ఎన్‌రెడ్డి, ఎడ్మ సత్యం, నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, నిర్మల శ్రీశైలంగౌడ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
బీఆర్‌ఎస్ ర్యాలీలో ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పు, డోలు కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. వేదిక వద్ద కళాకారుల ఆటపాటలు హోరెత్తించాయి. కేటీఆర్‌కు అభిమానులు నాగలి, సేవాలాల్ చిత్రపటాలను బహూకరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని మంగళవారం మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజ్, మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలి పంతునాయక్‌లు కేటీఆర్‌ను ఘనంగా సన్మానించారు.
ఒగ్గుడోలు ప్రదర్శన

జోష్

జోష్
Comments
Please login to add a commentAdd a comment