
ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
తేరు లాగి పరవశించిన భక్తజనం ● కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
మహిళా శిశు సంక్షేమశాఖ ఇన్‌చార్జి ఉమాహారతి
8లోu
ఆలయం ఎదుట భక్తజన సందోహం
కాశీ విశ్వనాథుడి
సేవలో స్పీకర్
అనంతగిరి: మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు వెళ్లిన శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ శనివారం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.
బాలల హక్కులపై అవగాహన అవసరం
కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి
కుల్కచర్ల: బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంపొందించుకోవాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా బాలల హక్కులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ... బాలలు తమ హక్కుల గురించి పూర్తిగా తెలసుకోవాలని సూచించారు. ఏవైన ఇబ్బందులు తలెత్తిన సమయంలో ఉపాధ్యాయులు లేదా అధికారులకు తెలపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొంది.
ఉత్తమ జానపద
గాయకుడిగా రాజశేఖర్
దోమ: ఉత్తమ జానపద గాయకుడిగా బొంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఎంపికయ్యారు. శనివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ యూవీ రత్నం, ప్రోగ్రాం డైరెక్టర్ దనాషి ఉషారాణి, హైకోర్ట్ అడ్వకేట్ జగదీశ్వర్‌రావు, కర్ణాటక సంగీత గాయకులు పుల్లూరి బాలసుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజశేఖర్ తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఎంతో మందిని ఆలోచింప జేశారని.. జానపద గాయకుడిగా ప్రజలను చైతన్యంచేస్తూ దేశ వ్యాప్తంగా తన గలాన్ని వినిపించారని ప్రశంసించారు. ఆయనకు మంచి భవిష్యత్ ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
ఆలయాభివృద్ధికి
నిరంతరం కృషి
ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి
కుల్కచర్ల: పాంబండ ఆలయాభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు వెళ్తామని పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఆలయంలో తలనీలాలకు సంబంధించిన వేలం నిర్వహించారు. ఈ వేలంలో సజ్జ శ్రీనివాస్ రూ.2.85లక్షలకు సేకరణ హక్కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. శివరాత్రి, ఆలయ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి ఆలయ ఈఓ నరేందర్, పాంబండ ఆలయ ఈఓ బాలనర్సయ్య, అర్చకులు పాండుశర్మ, ధశరథం, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: భక్తుల కొంగు బంగారం.. కోరిన వరాలిచ్చే కల్పవల్లి.. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. జాతరలో మూడో రోజు శనివారం సాయంత్రం 5.40 గంటలకు రథోత్సవం(తేరు లాగడం) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిమను రథంలో ఉంచి అమ్మా ఎల్లమ్మా.. కాపాడమ్మా.. కరుణించమ్మా అంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ ఏడాది రూ.14లక్షలతో తయారు చేయించిన రథాన్ని లాగుతున్న సమయంలో అమ్మవారి నామస్మరణతో పోలేపల్లి దద్దరిల్లింది.
భక్తజన సందోహం
అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. బుడగ జంగాలు, కురుమ, గొల్ల యాదవులు, బైండ్ల వారు ఆలయ ప్రాంతంలో జాగరణ చేస్తూ ఎల్లమ్మ తల్లి ఇతివృత్తాంతం ఆటపాటలతో తెలియజేశారు. ఆలయ చైర్మన్ జయరాములు, ఆలయ కమిటీ సభ్యులు వెంకటయ్యగౌడ్, లక్ష్మి, ఈఓ రాజేందర్‌రెడ్డి, నిర్వహకులు నర్సింహ, సింగర్ నర్సింహ తదితరులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జీవ వైవిధ్యాన్ని
పరిరక్షించాలి
నందిగామ: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే బా ధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 20న ప్రారంభమైన జాతీయ యూత్ బయోడైవర్సిటీ సద స్సు శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదట గా జీవ వైవిద్య సదస్సు ఏర్పాటు చేసిన ఘన త తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని అన్నారు. ప్రస్తుతం అంతరించిపోతున్న ప్రకృతి, సహజ సంపద, జీవరాసులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత ప్రకృతిని కాపాడటంతో పాటు జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు సైతం అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేయొద్దని, ప్రకృతిని, మానవ వనరులను కాపాడుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అడవులు, నీటి వనరులు, ప్రకృతి, పర్యవరణం దేవుడిచ్చిన వరాలని, వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకు ముందు జీవ వైవిధ్య అవగాహన, పరిరక్షణ, నిబద్ధతకు సంబంధించి జీవ వైవిధ్య హైదరాబాద్ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో 28 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 72 మంది విద్యార్థులు, ఎన్విరాన్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమద్ నాదిమ్, బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ ఖాళీ చరణ్ పాల్గొన్నారు.
ధారూరు: ఆడపిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని మహిళా శిశు సంక్షేమశాఖ ఇన్‌చార్జి, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేజీబీవీల విద్యార్థినులకు నియోజకవర్గ స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు శిశు సంక్షేమశాఖ ఇన్‌చార్జి, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆడపిల్లలు అన్నిరంగాల్లో రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా కేజీబీవీల ఉపాధ్యాయులు, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి
బంట్వారం: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉందని ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. శనివారం ఆమె ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కింద ఎంపికై న కోట్‌పల్లి మండలంలోని ఎన్నారం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యమన్నారు. క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పాఠాలు చదివించి సామర్థ్యాన్ని అంచనావేశారు. ఎఫ్‌ఎల్‌ఎన్ పై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించారు. ఆమె వెంట ఎంఈఓ చంద్రప్ప, సీఆర్‌పీ నర్సింలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
న్యూస్‌రీల్

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి

ఆడపిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment