
పేదరిక నిర్మూలనకే సెర్ప్
అనంతగిరి: సామాజిక సేవా రంగాల్లో మహిళా సంఘాల పాత్ర కీలకమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం సీఆర్పీల వ్యూహంపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన సీఆర్‌పీలు రెండు వారాలపాటు దోమ, వికారాబాద్, ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట్ మండలాల్లోని గ్రామాలను సందర్శించి స్వయం సహాయక సంఘాల బలోపేతానికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో ఏర్పాటు చేసిన సమీక్షకు కలెక్టర్ ప్రతీక్‌జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం నిర్మూలనే సెర్ప్ ప్రధాన ఉద్దేశమన్నారు. స్వయం సహాయక సంఘాలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటూనే సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని సూచించారు. సమాజంలో బాల్యవిహాలు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. మహిళా సంఘాలు పొదుపు చేయడంతో పాటు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళా సంఘాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ సంఘాలను నెలకొల్పడంతో పాటు మూతబడిన సంఘాలను పునరుద్ధరించే విధంగా అధికారులు, సంఘాల సభ్యులు కృషి చేయాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశాలు నిర్వహించుకుంటూ పొదుపు, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు, బ్యాంకులకు చెల్లించిన అప్పుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ పుస్తక నిర్వహణను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సీఆర్‌పీలు మహిళా సంఘాల బలోపేతానికి సంబంధించిన విషయాలను కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు నివేదికల ద్వారా వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, అదనపు డీఆర్డీఓ సరోజ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు అలివేలు, డీపీఎం వీరయ్య, గ్రామ మహిళ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొత్త సంఘాలు నెలకొల్పుతూ మూతబడిన సంఘాలనుపునరుద్ధరించండి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment