
పాలనా నైపుణ్యాలు పెంచుకోవాలి
అనంతగిరి: శిక్షణలో పాలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–4 ఫలితాలతో పోలీసు శాఖలో నియమితులైన జూనియర్ అసిస్టెంట్‌లకు ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీసు అకాడమీలో ఆరు వారాల పాటు బేసిక్ ఇంట్రడక్షన్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో 71 మంది ట్రైనీ జూనియర్ అసిస్టెంట్‌లు శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని డీపీఓ విభాగాన్ని సందర్శించారు. డీపీఓలోని ఎ–సెక్షన్, పే సెక్షన్, బడ్టెట్ సెక్షన్, ప్రజావినతుల పరిష్కార విధానాలు, వివిధ విభాగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై శిక్షణ పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పరిపాలన విభాగం ప్రధానమైనది అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నూతన విధానాలను అవలంబించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఈ విభాగంలో పనిచేసేందుకు నైతిక విలువ, క్రమశిక్షణ, సమర్థత ముఖ్యమన్నారు. పోలీసు సిబ్బందికి ఎల్లపుడూ అందుబాటులో ఉండే విధంగా సత్వర సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హనుమంత్‌రావు, ఆర్‌బీవీఆర్‌ఆర్ డీఎస్పీ భాస్కర్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, బి–సెక్షన్ సూపరింటెండెంట్ మోహనప్ప, పే–సెక్షన్ సూపరింటెండెంట్ మీర్జా జావిద్ బేగ్, ఆర్‌ఐ డేవిడ్, విజయ్, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment