
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
కేశంపేట: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే షాద్‌నగర్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల పరిఽధిలోని కాకునూర్ మహాలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడాతూ.. గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు ఇలాంటి పోటీలు అద్దం పడుతాయని తెలిపారు. ఆలయానికి త్వరలోనే రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోటీల్లో తెలంగాణతో పాటు అంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోటీదారులు తలపడ్డారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూడ వీరేశ్, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల, నాయకులు శ్రావణ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పల్లె అనంద్‌కుమార్, గిరియాదవ్, తైధ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కాకునూర్‌లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
Comments
Please login to add a commentAdd a comment