బైపాస్‌పై భద్రతేదీ..! | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌పై భద్రతేదీ..!

Published Tue, Mar 4 2025 6:31 AM | Last Updated on Tue, Mar 4 2025 6:31 AM

బైపాస

బైపాస్‌పై భద్రతేదీ..!

ప్రమాదకరంగా చెంగోల్‌ రోడ్డు
● ప్రాణాలు గాల్లో కలుస్తున్నాపట్టించుకోని అధికారులు ● వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌

తాండూరు రూరల్‌: బైపాస్‌ రోడ్డుపై భద్రత కరువైంది. ఈ రోడ్డు పనులు చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్నాయి. నిత్యం ఈ మార్గంలో నాపరాయి రవాణా చేసే లారీలు పెద్ద సంఖ్యలో వెళ్తుంటాయి. కొంత మంది డ్రైవర్లు మద్యం తాగి వాహనాలను అతి వేగంగా నడపడం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

వ్యాపార కేంద్రంగా..

తాండూరు మండలం వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ మండలంలో నాపరాతి గనులు, పాలిషింగ్‌ యూనిట్లు, సిమెంట్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం వివిధ ప్రాంతాలకు లారీల్లో నాపరాయి బండలు, సిమెంట్‌ బస్తాలను తరలిస్తుంటారు. గౌతాపూర్‌ నుంచి తాండూరు పట్టణంలోకి భారీ వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి 2016లో అప్పటి ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూ రు చేసింది. తాండూరు, యాలాల మండలాలను కలుపుకొని బైపాస్‌ రోడ్డు నిర్మించాలని నిర్ణయించా రు. గౌతాపూర్‌ సమీపంలో కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ వెనుక నుంచి చెంగోల్‌ శివారు, భూకై లాస్‌ తండా, అంతారం, బషీర్‌మియా తండా నుంచి ఖాంజాపూ ర్‌ గేటు వద్ద తాండూరు– హైదరాబాద్‌ రోడ్డుకు బైపాస్‌ రోడ్డు అనుసంధానం అవుతుంది. అలాగే యాలాల మండలం కోకట్‌ శివారు నుంచి తాండూరు– కొడంగల్‌ రోడ్డు మార్గంలోని శ్రీనివాస రైస్‌ మిల్లు వద్ద బైపాస్‌ రోడ్డు అనుసంధానంగా నిర్మించారు. దీంతో భారీ వాహనాలు పట్టణం లోపల నుంచి కాకుండా బైపాస్‌ మీదుగా వెళ్లాయి. ప్రస్తు తం రోడ్డు విస్తరణ పనులు 70శాతం పూర్తయ్యా యి.అయితే కొంత మంది రైతులకు భూ పరిహారం చెల్లించక పోవడంతో అక్కడక్కడ పనులు అ సంపూర్తిగా మిగిలిపోయాయి.ప్రస్తుతం ఈ మార్గంలో కేవలం నాపరాతి లారీలు మాత్రమే వెళ్తున్నాయి.

చెంగోల్‌ మార్గం ప్రమాదం

బైపాస్‌ రోడ్డులోని చెంగోల్‌ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ గ్రామం మీదుగా నిత్యం ప్రజలు తాండూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. నాపరాయి, ఎర్రమట్టి లారీలు అతివేగంగా వెళ్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే చౌరస్తా వద్ద తండ్రీకొడుకులను లారీ ఢీకొనడంతో వారు మృతి చెందిన విషయం తెలిసిందే.

స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

చెంగోల్‌ చౌరస్తా, భూకై లాస్‌ తండా, అంతారం శివారు మీదుగా తాండూరు – సంగారెడ్డి ప్రధాన చౌరస్తా ఉంది. ఇక్కడ వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చెంగోల్‌ – గౌతాపూర్‌ మార్గంలో సీసీ రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే బైపాస్‌ వద్ద అటు ఇటు బారికేడ్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది.

డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు చేయాలి

ఓగిపూర్‌, కరన్‌కోట్‌, మల్కాపూర్‌, కోటబాసుపల్లి తోపాటు కర్ణాటక రాష్ట్రంలోని మిర్యాణ్‌ నుంచి నిత్యం నాపరాతి లోడ్‌తో లారీలు తాండూరు పట్టణానికి వస్తుంటాయి. కొన్ని లారీలు మాత్రం చెంగోల్‌ బైపాస్‌ మీదగా వెళ్తుంటాయి. లారీ డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

చెంగోల్‌ బైపాస్‌ రోడ్డు

పొలానికి వెళ్లాలంటే..

చెంగోల్‌ – అంతారం తండా బైపాస్‌ రోడ్డు పక్కనే మా పొలం ఉంది. రోజూ పొలానికి వెళ్లాలి. నిత్యం పెద్ద సంఖ్యలో నాపరాతి లోడ్‌తో లారీలు బైపాస్‌ మీదగా వెళ్తుంటాయి. అతివేగంగా వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయమేస్తోంది. అధికారులు చొరవ తీసుకొని వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి.

– మహబూబ్‌, రైతు, చెంగోల్‌ గ్రామం

No comments yet. Be the first to comment!
Add a comment
బైపాస్‌పై భద్రతేదీ..!1
1/2

బైపాస్‌పై భద్రతేదీ..!

బైపాస్‌పై భద్రతేదీ..!2
2/2

బైపాస్‌పై భద్రతేదీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement