
బోరు మోటారు తీసేందుకు వెళ్లి..
నీటిలో మునిగి వ్యక్తి మృతి
పూడూరు: బావిలో చెడిపోయిన బోరు మోటారును తీసేందుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖుత్బుల్లాపూర్‌కు చెందిన జోగు తిరుపతయ్య (25)ను ఆదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జోగు రామకృష్ణ, వాటర్‌మెన్ రాములు కలిసి చేదరుబావిలో బోరు మోటారు ఉంది తీయాలని తెలపడంతో తిరుపతయ్య బావిలోకి దిగాడు. నీటిలోకి వెళ్లి ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానంతో పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామస్తులు బావిలోకి దిగి తిరుపతయ్యను బయటికి తీశారు. అప్పటికే తిరుపతయ్య మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి అన్న జోగు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment