నవాబుపేట: పశువుల పాకలో ఉన్న మేకలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన సంఘటన మండలంలోని మీనపల్లికలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శీలపురం నర్సింలుకు చెందిన రెండు మేకలు, ఒక గొర్రె పోతును మంగళవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న పాకలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం పాక దగ్గరకు వెళ్లి చూడగా కనిపించలేదు. సుమారు రూ.35 వేల విలువగల జీవాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పరీక్ష కేంద్రం
చూసేందుకు వెళ్తూ..
రోడ్డు ప్రమాదానికి గురైన ఇంటర్ విద్యార్థి
తాండూరు టౌన్: తెల్లారితే పరీక్ష ఉండటంతో సెంటర్ ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై వెళ్తున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై ఇందిరాచౌక్ నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. రాయల్‌కాంటా వద్ద టర్నింగ్ తీసుకుంటున్న జనగాం గ్రామానికి చెందిన పట్నం సుధాకర్ బైకు ఢీకొన్నాయి. దీంతో కిందపడిన శ్రీకాంత్ తలకు తీవ్ర గాయమైంది. సమాచారం మేరకు 108లో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.
హుండీ చోరీకి విఫలయత్నం
కొందుర్గు: ఆలయంలో చోరీకి యత్నించిన ఓ దుండగుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామం సోమలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సాయికుమార్ బుధవారం ఉదయం ఆలయ పరిసరాల్లో ఎవ రూ లేని సమయంలో హుండీలోని డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. అటుగా వె ళ్తున్న గ్రామస్తులు గమనించి అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ వీరన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment